ప్రాథమిక ఆధారాలే లేవు.. మీడియా ముందుకు ఎందుకెళ్లారు?.. సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం..
తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.. ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక వైపు సిట్ (SIT) దూకుడు పెంచగా, మరో వైపు సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.. తిరుమల లడ్డూ కల్తీ విషయంపై సుప్రీంకోర్టులో సమవారం హాట్ హాట్ గా విచారణ కొనసాగింది.. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా..? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.. లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని.. ప్రభుత్వ న్యాయవాది లూథ్రా వివరించారు.. తయారైన లడ్డూలని టెస్టింగ్కు పంపించారా..? అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా.. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా….? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ పూర్తికాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి.. ల్యాబ్ రిపోర్టులో ఉన్న నెయ్యితో లడ్డూ తయారుచేసినట్లు ప్రాథమిక ఆధారాలు లేవంటూ ధర్మాసనం పేర్కొంది.