ఆరోగ్యానికి ఆత్మరక్షణకు కరాటే సాధన అవసరం
1 min read
ఆరోగ్యానికి ఆత్మరక్షణకు కరాటే సాధన అవసరం
జిల్లా ఉషూ సంఘం అధ్యక్షులు గూడూరు గోపాల్
కర్నూలు స్పోర్ట్స్, ఫిబ్రవరి 27, ( కర్నూలు ప్రభ న్యూస్ ) :
ఆరోగ్యానికి ఆత్మరక్షణకు కరాటే సాధన అవసరం జిల్లా ఉషూ సంఘం అధ్యక్షులు గూడూరు గోపాల్ అన్నారు. యూనివర్సల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ డైరెక్టర్ టి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉషూ సంఘం అధ్యక్షులు గూడూరు గోపాల్ హాజరై మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల రోగాలన్నీ దూరం అవడం కాకుండా ఏకాగ్రత, పట్టుదల మరియు ఆత్మ రక్షణకు తోడ్పడుతుందని అన్నారు. తల్లిదండ్రులు చిన్నారులను తమకు నచ్చిన క్రీడలో రాణించెందుకు ప్రోత్సాహించాలని అన్నారు. అనంతరం కలర్ బెల్ట్ లు సాధించిన క్రీడాకారులకు బెల్టులను ప్రధానం చేశారు. బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు ఎనిమిది ఈవెంట్లో టెస్టు నిర్వహించగా ఆరెంజ్ బెల్టు సాధించిన వారిలో మనస్విని, ఫర్హాన్, కీర్తన, మౌలాలి, సురేంద్ర, హర్షిత్, వరుణ్, మనోహర్, జయచంద్ర, రక్షిత, వినూత్న, గమ్య శ్రీ, జ్యోతి, సంపూర్ణ, రెహాన్, బ్లూ బెల్ట్ సాధించిన వారిలో ధుత్తి, అనురాధ, సన్నీ, సూర్య ప్రకాశ్ రెడ్డి, సాయి, మెరూన్ రెడ్ బెల్టు సాధించిన వారిలో జయశ్రీ, సమంత, రవి వర్మ, రేవతి, చక్రవర్తి, చందు అర్హత బెల్ట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జామినర్ లుగా క్రాంతి, శ్రీనివాస్, ఝాన్సీ, శ్రీలేఖ పాల్గొన్నారు.