శ్రీశైలం మల్లన్న భక్తులకు ప్రత్యేక వైద్య శిబిరం
1 min read
మెగా వైద్య శిబిరాన్ని మల్లన్న భక్తులు సద్వినియోగం చేసుకోండి
రక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ఎం. నాగరాజు
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన రక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఉచిత వైద్య సేవలతో పాటు మందులు పంపిణీ
కర్నూలు / ఆత్మకూరు, ఫిబ్రవరి 27, (కర్నూలు ప్రభ న్యూస్) :
శ్రీశైలం వెళ్లే శివ భక్తులు మెగా వైద్య శిబిరాన్నిసద్వినియోగం చేసుకోవాలని రక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ఎం. నాగరాజు తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాలినడకన సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే శివ భక్తుల సౌకర్యార్థం రక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఆత్మకూరు పరిధిలోని వెంకటాపురం స్టేజీ వద్ద శ్రీశైలం మల్లన్న భక్తుల కోసం ప్రత్యేక వైద్య సేవలు ఏర్పాటు చేశారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో భక్తులకు వైద్య సేవలతో పాటు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ఎం. నాగరాజు మాట్లాడుతూ కాలినడకన సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే శివ భక్తుల కోసం ఉచిత వైద్య సేవలతో పాటు మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య బృందం గోపీచంద్, రాజు, స్టాఫ్ సిబ్బంది దేవేంద్రాచారి, , మహేష్, ఆమోష్, వెంకట్, రాజు ప్రవీణ్, నర్సులు, మల్లీశ్వరి, సుజాత, పాల్గొని వైద్య సేవలతో పాటు,మందుల పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేపట్టిన రక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, డాక్టర్లకు ,సిబ్బందికి ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కే బలరాం, బీసీ విద్యార్థి జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ , జనసేన పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ కురువ, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కురువ శివలు వారిని ఘనంగా సత్కరించి సన్మానం చేశారు.