September 25, 2023

గాడిచెర్ల సేవలు మరువలేనివి : – రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్

1 min read
TG VENKATESH

గాడిచెర్ల సేవలు మరువలేనివి

– రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్

కర్నూలు టౌన్, ఫిబ్రవరి 27, (కర్నూలు ప్రభ న్యూస్) :

ఆంధ్రప్రదేశ్ లో గ్రంధాలయాల అభివృద్దికి గాడిచెర్ల హరిసర్వో త్తమరావు చేసిన సేవలు మరువలేనివని రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్ అన్నారు. గాడిచెర్ల వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాటి స్వాతంత్ర్య సమర యోధులు బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్ వంటి మహోన్నత దేశభక్తుల నుంచి స్ఫూర్తి పొందిన గాడిచెర్ల స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారని అన్నారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంధాలయ అభివృద్దికి తాను నిరంతరం కట్టుబడి ఉన్నానని చెప్పారు. గౌరవ అతిధిగా పాల్గొన్న క్లస్టర్ యూనివర్సిటీ వైస్-చాన్సలర్ డి.వి.ఆర్.సాయి గోపాల్ మాట్లాడుతూ సమాజ ప్రగతికి గ్రంధాలయాలు ఎంతగానో తోడ్పడుతాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు గ్రంధాలయాలను జ్ణానసముపార్జన కేంద్రాలుగా భావించినప్పుడే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని అన్నారు. గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర కల్కూరా మాట్లాడుతూ టి.జి.వెంకటేష్ సహకారంతోనే జిల్లా కేంద్ర గ్రంధాలయాన్ని ఉన్నతస్థాయిలో తీర్చిదిద్దగలిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో జె.యస్.ఆర్కే శర్మ, ఎలమర్తి రమణయ్య, బొల్లెద్దుల రామకృష్ణ, హెచ్.కె.మనోహర్, గ్రంధాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!