September 28, 2023

చుంచులూరులో పల్స్ పోలియో కార్యక్రమం

1 min read
NELLORE NEWS

చుంచులూరులో పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం

నెల్లూరు / మర్రిపాడు, ఫిబ్రవరి 27, (కర్నూలు ప్రభ న్యూస్) :

మర్రిపాడు మండలం చుంచులూరులో పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని గ్రామ రెవెన్యూ అధికారి చిన్నయ్య చిన్నారులకు వ్యాక్సిన్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  భాగంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేస్తున్నామని,ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఖాజామొహియుద్దీన్,హెల్త్ అసిస్టెంట్ నాగిరెడ్డి, ఉపాధ్యాయురాలు సునీత,అంగన్వాడీ కార్యకర్త ఆదిలక్ష్మమ్మ,ఆశా కార్యకర్త తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!