నందవరంలో పల్స్ పోలియో కార్యక్రమం
1 min read
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ లక్ష్మీ ప్రసాద్ యాదవ్,
సర్పంచ్ గాలిబోయిన రామ్మోహన్
నెల్లూరు/మర్రిపాడు, ఫిబ్రవరి 27, (కర్నూలు ప్రభ న్యూస్) :
మర్రిపాడు మండల పరిధిలోని నందవరం మండల ప్రజా పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల నందు పల్స్ పోలియో కార్యక్రమాన్ని (ఎం,పీ,టీసీ) లక్ష్మీ ప్రసాద్ యాదవ్.సర్పంచ్ గాలిబోయిన రామ్మోహన్. వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా, ఎంపీటీసీ లక్ష్మి నూనె ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు పోలియో లేని ప్రాంతాలుగా ఆవిర్భవించాలని పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. అలాగే సర్పంచ్ మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్ మనదే కాబట్టి ఎన్ని పనులు ఉన్న సరే తలిదండ్రుల తప్పకుండా ప్రతి చిన్నారి కి పోలియో చుక్కలు వేయించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక వీఆర్వో తిరుమలరావు, ఎం, ఎల్, హెచ్, పి, షేక్ రహిమాన్, ఏఎన్ఎంలు షేక్ నూర్జహాన్ ఆశా, నారాయణమ్మ,వాలంటీర్లు మరియు స్థానిక వీఆర్ ఏలు తదితరులు పాల్గొన్నారు