ఏఎస్ పేటలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభ
1 min read
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఫిబ్రవరి 27, (కర్నూలు ప్రభ న్యూస్) :
ఏఎస్ పేట మండల కేంద్రంలోని సచివాలయం ఆవరణలో వైసీపీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, జెడ్ పి టి సి పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ ఆధ్వర్యంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాపసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్పేట, ఆత్మకూరు, అనంతసాగరం మండలం వైసిపి నాయకులు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ పేట జడ్పిటిసి పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ మాట్లాడుతూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన బిడ్డ కంటే చాలా ఎక్కువగా తమతో ఉండేవారని ఆయన ఇప్పుడు లేకపోవడం తలుచుకుంటేనే బాధ వేస్తుందని ఆవేదన చెందారు. ఆత్మకూరు ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్న మంచి వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ అజాతశత్రువు గా కొనియాడడం నేటి రాజకీయాల్లో అరుదు అని తెలిపారు. ఏఎస్పేట మండల కో ఆప్షన్ సభ్యులు సంధాని భాష మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు మేకపాటి గౌతమ్ రెడ్డి వారి కుటుంబం అని అన్నారు. అనంతరం పలువురు వైసిపి నాయకులు, వివిధ మండలాల నాయకులు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో తనకున్న అనుబంధం గురించి ఈ సందర్భంగా సంతాప సభలో సభ్యులు, ప్రజలు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణానికి సంతాపం ప్రకటించి కొద్దిసేపు మౌనం వహించారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండలం జెడ్ పి టి సి, ఎంపీపీలు రాపూరు వెంకటసుబ్బారెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, ఆత్మకూరు జడ్పిటిసి ప్రసన్నలక్ష్మి, ఏఎస్ పేట సర్పంచ్ భర్త షేక్ జిలాని భాష, వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి,ఏఎస్పేట మండల కో ఆప్షన్ సభ్యులు సంధాని భాష, సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి ,వైసిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొండ వెంకటేశ్వర్లు, రాజవోలు సొసైటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ షబ్బీర్, ఆత్మకూరు పట్టణ యువత అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, ఏఎస్పేట వైసిపి యూత్ ప్రెసిడెంట్ షేక్ షౌకత్ అలి, నాయకులు పెమ్మసాని శ్రీనివాసులు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.