September 27, 2023

ఆఫర్లు మీద ఆఫర్లు ఇస్తున్న తెలంగాణ పోలీస్ శాఖ..

1 min read

Pending Challan: వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పోలీస్ శాఖ. రహదారులపై నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ-చలాన్‌లు అందుకుంటూ.. వాటిని భారంగా భావించి ఫైన్స్ చెల్లించకుండా వదిలేసిన వాహనదారులకు తెలంగాణ పోలీసులు ఊరట కల్పించారు. పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టేందుకు భారీగా డిస్కౌంట్ ఇచ్చారు. ఉల్లంఘనలపై ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా కొందరు చెల్లిస్తున్నారు, మరి కొందరు భారంగా భావించి వదిలేస్తున్నారు. దీంతో పెండింగ్‌ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ రాయితీలు ప్రకటించింది పోలీస్ శాఖ. టూ, త్రీ వీలర్లు, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ ప్రకటించింది. కార్లకు 50%, భారీ వాహనాలకు 80% రాయితీ ప్రకటించింది. ఇక కరోనా సమయంలో మాస్క్ లేకుండా చలాన్లు పడిన వాహనదారులకు శుభవార్త చెప్పారు పోలీసులు. 100 రూపాయలు చెల్లిస్తే వితౌట్ మాస్క్ చలాన్ క్లియర్ చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం మార్చి 1 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చలాన్ల చెల్లింపులను  ‘ఈ-లోక్‌ అదాలత్‌’ నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. మార్చి నెల 1- 31 మధ్య కాలంలో ఎటువంటి నిరీక్షణ లేకుండా.. ఈ-చలానాల వెబ్‌సైట్‌(https://echallan.tspolice.gov.in/publicview) లోనే వాహనదారులు తమ పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా పోర్టల్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. కాగా ఈ పెండింగ్ చెలానా చెల్లింపు సొమ్ముకు సర్వీస్‌ఛార్జ్‌ రూ. 35 అదనంగా వసూలు చేస్తారు. గత ఎనిమిదేళ్లుగా వాహనదారులు చెల్లించని జరిమానా రూ.600 కోట్లకు చేరినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!