బీజేపీలో కాంగ్రెస్ లక్షణాలు.. మంచిది కాదంటున్న నేతలు..!
1 min read
కాషాయదండులో గత కొన్నాళ్లుగా అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. రెబల్ నేతలు భారతీయ జనతా పార్టీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రహస్యంగా పదిహేను సార్లు భేటీ అయ్యారు. సంజయ్ సొంత జిల్లాకు చెందిన నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, అర్జున్‌రావులాంటి నేతలు ఏకంగా అసమ్మతిని హైదరాబాద్ వరకు రాజేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో రెబల్ బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. అధిష్టానం నిత్య అసమ్మతివాదులపై వేటు వేయాలని తుది నిర్ణయం జరిగిపోయింది. సరిగ్గా అదే టైంలో కీలక మలుపు చోటుచేసుకుంది.