25వేలు రూపాయల ఆర్థిక సాయం
1 min read
రంజీ మహిళా క్రికెటర్లు మంత్రి గుమ్మనూరు జయరామ్ 25వేలు రూపాయలు ఆర్థిక సాయం
హోళగుంద, మార్చి 29, (కర్నూలు ప్రభ న్యూస్) :
ఆలూరు నియోజకవర్గం మంత్రి క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణానికి చెందిన రంజీ మహిళా క్రికెటర్లు నీరుగట్టి అనూష,జి.శరణ్య,ఇతరులు పలువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపున ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ, ఎక్కడ క్రికెట్ ఆడిన్నారు.వారిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రంజీ మహిళా క్రికెటర్లు మాట్లాడుతూ హైదరాబాద్, గోవా,మరియు పలు రాష్ట్రాల్లో పాల్గొన్ని బాగా ఆడినాము అని తెలిపారు. అలాగే త్వరలో ఆల్ ఇండియా మహిళా క్రికెట్ టీమ్ తరుపున ఆడే అందుకు సిద్ధంగా ఉన్నాము అని మంత్రి గారికి తెలిపారు. తక్షణమే స్పందించిన మంత్రి వారికి 25వేలు ఆర్థిక సాయం అందించారు. అలాగే మీరు ఇక్కడ క్రికెట్ జరిగిన పాల్గొన్ని రాష్ట్రానికి,మన జిల్లాకు,మరియు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి అని మంత్రి ఆశాభావాన్ని వ్యక్త పరిచారు.