September 25, 2023

ఇంటి పట్టాలు అర్హులకు అందజేయండి ..

1 min read

ఇంటి పట్టాలు అర్హులకు అందజేయండి ..

ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ వెంకప్ప..

హోళగుంద, మార్చి 29, (కర్నూలు ప్రభ న్యూస్) :

మండల పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇంటి పట్టాలు పంపిణీలో అర్హులైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం ఏర్పడిందని, అర్హులైన నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ వెంకప్ప అన్నారు.
సోమవారం మండల కేంద్రం హోళగుంద తహశీల్దార్ కార్యాలయం నందు తహశీల్దార్ శేషపణితో ఆయన మాట్లాడుతూ ఇంటి పట్టాలు పంపిణీలో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని, భూస్వాములకు అగ్రవర్ణాల కులాలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి అర్హులైన లబ్దిదారులకు అన్యాయం చేయడం బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. ఈ విషయంపై లబ్దిదారులకు న్యాయం జరగకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. అదే విధంగా అయోధ్య నగర్ కాలనీ, మండల పరిధిలోని నెరణికితాండ, ముద్దటామాగి, నాగరకన్వీ తదితర గ్రామాలలో త్రాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్రాగునీటి అవసరాలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీనాయకులు నాగరాజు, శ్రీనివాసులు, మంజునాథ్, బిలాల్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!