సంక్షేమ, అభివృధ్ది టీడీపీ లక్ష్యం.
1 min read
తెలుగు ప్రజల గొప్పతనాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడింది
తెలుగుదేశం పార్టీనే – దేశాయ్ మాధవరావు
సంక్షేమ, అభివృధ్ది టీడీపీ లక్ష్యం.
నందవరం మండలంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
:నందవరం, మార్చి 29, (కర్నూలు ప్రభ న్యూస్) :
తెలుగు ప్రజల గొప్పతనాన్ని , ఆత్మ గౌరవం ను ప్రపంచానికి తెలిసేటట్లుగా చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని , అంతేకాకుండా ప్రజలకు అవసరమైన సంక్షేమ అభివృధ్ది పథకాలు అందించి తెలుగు జాతి వైభవాన్ని చాటి చెప్పిన ఘనత కూడా తెలుగు దేశం పార్టీనే అని ఎమ్మిగనూరు మార్కెట్ మాజీ చైర్మన్ దేశాయ్ మాధవరావు, టిడిపి మండల కన్వీనర్ చిన్నరాముడు పేర్కొన్నారు. మంగళవారం నందవరం లో స్థానిక టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నలభైవ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ముందుగా టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా మాచాపురం ,ముగతి ,మిట్ట సోమపురం,నాగలదీన్నే, టి.సోమలగూడూర్ ,ఇబ్రహీంపురం ,కనకవీడు తదితర గ్రామాలలో కూడా ఆయా గ్రామ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం జనతా వస్త్రాలు, రెండు రూపాయలకు కిలో బియ్యం, పటేల్ , పట్వారి వ్యవస్థ రద్దు, మండల కార్యాలయాల పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలతో ప్రజలను రాజకీయంగా చైతన్య పరుస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేశారని అన్నారు. ఆ నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరంకుసత్వ ,అరాచకాలను పారద్రోలేందుకు ,పాలకుల నుండి ప్రజలను రక్షించేందుకు తెలుగు ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 న తెలుగు దేశం పార్టీని స్థాపించారు. నేటికి టీడీపీ స్థాపించి 40 వసంతాలు పూర్తి అయినవి అని అన్నారు. ఆనాడు దేశంలోనే నూతన శకానికి నాంది పలికారన్నారు.ఆ నాడు ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్ళు ,సమాజమే దేవాలయం అని మనసా వాచా మనస్ఫూర్తిగా నమ్మిన మహానుభావుడు అని అన్నారు. అందుకే పార్టీ స్థాపించిన 9 నెలలకే రాష్ట్రంలో అధికారం చేపట్టి తెలుగు ఆడపడచుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా సంపూర్ణ మద్య నిషేధం ను అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని అన్నారు. నేటి పాలక ప్రభుత్వ వైస్సార్ పార్టీ నాయకులు ప్రజలకు చెప్పేదొకటి చేసేదొకటన్నారు.ఈ మూడేళ్ళలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి సామాన్య ప్రజానీకానికి తీవ్ర ద్రోహం చేసిందన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ రైతు సంఘం అధ్యక్షులు పెద్దరాముడు, గ్రామ అధ్యక్షుడు ఈష, మండల యూత్ అధ్యక్షులు విశ్వనాథ్, టీడీపీ నాయకులు షరీఫ్ ,లక్ష్మన్న, బసప్ప , మల్లికార్జున,బసవరాజు, ఈరన్న,వలి ,వడ్డేగిరి నరసింహులు, పొంపయ్య, ముగతి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ బాలరాజు,బోయ నరసింహులు, గొల్ల తాయన్న, అల్లుడు అర్జున్, బోయ దస్తగిరి, తులసిరామ్ రెడ్డి,ఈడిగ రాజు, కొండయ్య, గడ్డ మీద నరసింహుడు, ఈడిగ వెంకటేష్, టైలర్ సోమేష్, ధనుoజయరెడ్డి, ఈరన్న, శ్రీను, రమేష్, నరసన్న, శేఖర్, గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.