సంక్షేమ, అభివృధ్దిని ప్రవేశపెట్టింది టిడిపి
1 min read
సంక్షేమ, అభివృధ్దిని ప్రవేశపెట్టింది టిడిపి : దేశాయ్ మాధవరావు
నందవరం లో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నందవరం, మార్చి 29, (కర్నూలు ప్రభ న్యూస్) :
నందవరం సంక్షేమ, అభివృధ్ది పథకాలు ప్రవేశపెట్టి తెలుగు జాతి గౌరవాన్ని చాటిచెప్పింది తెలుగు దేశం పార్టీ అని,మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ దేశాయ్ మాధవరావు, టిడిపి మండల కన్వీనర్ చిన్నారాముడు పేర్కొన్నారు. మంగళవారం నందవరం లో స్థానిక టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నలభైవ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి. వేడుకల్ని ఘనంగా జరుపుకొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ .సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం జనతా వస్త్రాలు, రెండు రూపాయలకు కిలో బియ్యం, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు, మండల్ ఆఫీస్ ల పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలతో ప్రజలను చైతన్య పరుస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేశారని అన్నారు.ఈ కార్యక్రమం లో టీడీపీ రైతు సంఘం అధ్యక్షులు పెద్దరాముడు, గ్రామ అధ్యక్షుడు ఈష, మండల యూత్ అధ్యక్షులు విశ్వనాథ్, టీడీపీ నాయకులు షరీఫ్ ,లక్ష్మన్న, బసప్ప , మల్లికార్జున,బసవరాజు, ఈరన్న,వలి ,వడ్డేగిరి నరసింహులు, పొంపయ్య, తదితరులు పాల్గొన్నారు.