September 27, 2023

భూసేకరణకు రైతులు సహకరించండి

1 min read

జోలదరాసి ప్రాజెక్టు భూసేకరణకు రైతులు సహకరించండి :-

జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి :-

కర్నూలు కలెక్టరేట్ , మార్చి 29, (కర్నూలు ప్రభ న్యూస్)  : 

జోలదరాసి ప్రాజెక్ట్ భూసేకరణ కోసం రైతులు  సహకరించాలని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి రైతులను విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుంచి జోలదరాసి ప్రాజెక్టు భూసేకరణపై రైతులతో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జోలదరాసి ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం 2,500 ఎకరాలు సేకరించాల్సి ఉండగా మొదటి దపాలో వెలగటూరు, చింతకుంట, కలుగొట్ల, జోలదరాసి గ్రామాలలో 600 ఎకరాలు భూసేకరణ చేస్తున్నామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పే నాయక్ జాయింట్ కలెక్టర్ కు వివరించారు. అందులో భాగంగా మార్కెట్లో భూమి విలువ తదితర వివరాలను జాయింట్ కలెక్టర్ రైతులతో అడిగి తెలుసుకొని రైతులతో మాట్లాడారు. జోలదరాసి ప్రాజెక్టు నిర్మాణానికి రైతులందరూ కూడా భూసేకరణ వేగవంతం కోసం సహకరించాలని జాయింట్ కలెక్టర్ రైతులను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ అభిప్రాయాలను జాయింట్ కలెక్టర్ కు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోయిలకుంట్ల తహసీల్దార్, వెలగటూరు, చింతకుంట, కలుగొట్ల, జోలదరాసి గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!