September 28, 2023

వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

1 min read
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి
వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పత్తికొండ, మార్చి 30, (కర్నూలు ప్రభ న్యూస్) :
 
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలకు  వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వైద్యులను హెచ్చరించారు .
మంగళవారం పత్తికొండ లోని ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల సమీక్ష సమావేశాలకు హాజరై ప్రజలకు జవాబుదారితనం గా ఉంటూ సేవలందించాలని వైద్యులకు సూచించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వద్దని వైద్యులకు తెలిపారు. ఆసుపత్రిలో అభివృద్ధి పనుల పట్ల తనకు ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు, వైద్యానికి అవసరమైన పరికరాలు లేకపోతే చెప్పాలని వైద్యులను కోరారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అన్ని సౌకర్యాలు ఉన్నా ప్రతి చిన్న విషయానికి జిల్లా కేంద్రానికి రెఫర్ చేయడం ఎంతవరకు సమంజసమని వైద్యులను ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ కింద ప్రసవాలు చేయాలని, అలాగే ఉన్న పరికరాలతో డెంటల్ వైద్యులు రోగులకు సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆస్పత్రి రిజిస్టర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే విజిటర్స్ బుక్ లో సంతకం చేశారు.
Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!