ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టిన వెల్ఫేర్ పార్టీ
ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టిన వెల్ఫేర్ పార్టీ
కర్నూలు కలెక్టరేట్ , మార్చి 28, (కర్నూలు ప్రభ న్యూస్) :
నిత్యావసర సరుకులు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడంతో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఎం జఫ్రుల్లా ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమము నిర్వహించి అనంతరం జెసి డాక్టర్ మనజీయర్ జిలాని సామూన్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నిత్యవసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను పెంచడం భావ్యం కాదన్నారు. రాష్ట్రంలో వై ఎస్ ఆర్ సి పి ఎంపీలు 22 మంది ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వత్తాసు పలకడం భావ్యం కాదన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించి పాత ధరలకే నిత్యావసర వస్తువులు డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ లను ప్రజలకు అందించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు ఇనాయత్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు కాలే షా వలి, ఎఫ్ ఐ టి యు జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా, పార్టీ కార్యకర్తలు సైఫుద్దీన్, ఎం పీ జే నగర అధ్యక్షుడు మహమ్మద్ పీర్, మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.