హైదరాబాద్ చేరిన తెలుగు విద్యార్థులు
1 min read
Russia Ukraine Crisis: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు విమానాల్లో 469 మందిని ఢిల్లీ తీసుకొచ్చారు. తెలుగు విద్యార్థులను ఏపీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు తరలించారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పటివరకు అక్కడే బస కల్పించారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి రెండో విమానంలో 250మంది భారత్ చేరుకున్నారు. ఇందులో 11మంది ఏపి విద్యార్థులు, 17మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ముంబై చేరుకున్న విమానంలో ఉన్న 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న ఉక్రెయిన్ నుంచి ముంబైకి విమానంలో 219మంది విద్యార్థులు చేరుకున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి భారత్ కు 469మంది విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.