బయోమెట్రిక్ డివైస్లు విరాళం
1 min read
బయోమెట్రిక్ డివైస్లు విరాళం
మద్దికేర, మార్చి 28, (కర్నూలు ప్రభ న్యూస్) :
మద్దికేర గ్రామ నివాసి నిచ్చెన మెట్ల కాశీ విశ్వనాథ్ వారి తండ్రి నిచ్చెనమెట్ల గోపాలయ్య జ్ఞాపకార్థం ఏడు వేల రూపాయలు విలువచేసే బయోమెట్రిక్ డివైజ్లను విరాళంగా ఇచ్చారు ఆయన మాట్లాడుతూ గ్రామంలో అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే వాలంటీర్లకు బయోమెట్రిక్ డివైస్ లు చాలినన్ని లేనందున వాలంటీర్లు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇది గమనించి పంచాయతీ కార్యదర్శులకు అందజేశాను అన్నారు అదేవిధంగా మద్దికెర మాజీ ఉప సర్పంచ్ యర్రవల్లి హనుమన్న కూడా 3,500/- విలువ చేసే ఒక డివైస్ ను విరాళంగా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఈవో ఆర్ డి మద్దిలేటి స్వామి, పంచాయతీ సలహాదారు బండారు అంజి, పంచాయతీ కార్యదర్శులు శ్రీహరి , రాధ, అనూష, కరుణ కుమారి మొదలగువారు పాల్గొన్నారు