విద్యుత్ వైర్లుకు రక్షణ చర్యలు తీసుకోండి
1 min read
విద్యుత్ వైర్లుకు రక్షణ చర్యలు తీసుకోండి
పంచాయతీ కార్యదర్శి శ్రీహరి
మద్దికేర, మార్చి 28, (కర్నూలు ప్రభ న్యూస్) :
మద్దికెర మండల కేంద్రంలోని మాధవి దేవాలయం నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వరకు దీనిని మద్దమ్మ కట్ట అని అంటారు. గతంలో ఇక్కడ వీధిలైట్లు ఉండేవి కాదు. ప్రజలు వాహనదారులు భక్తులు విజ్ఞప్తి మేరకు పంచాయతీ ఆధ్వర్యంలో కట్టు పొడవునా వీధి లైట్లు వేయడం జరిగింది. ఇటీవల రెండు సార్లు వైర్లు తెగిపోయాయి. వార్డు సభ్యులు మరియు ప్రజల విజ్ఞప్తి మేరకు కొత్త వైర్లు తెప్పించి వీధిలైట్లు వేయడం జరిగింది. గత శనివారం నాడు గుర్తు తెలియని వ్యక్తులు వైర్లు కట్ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. కావున మద్దికేర పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి శ్రీహరి తెలిపారు