వ్యక్తిపై కేసు నమోదు
వ్యక్తిపై కేసు నమోదు
కొలిమిగుండ్ల, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన దేవేంద్ర పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరినాథ్ రెడ్డి సోమవారం తెలిపారు. నర్సి రెడ్డి ఇంట్లో నుండి తన ఇంట్లోకి నీరు వస్తుందని ఎన్నిసార్లు చెప్పినా వినవా నిన్ను చంపుతాను అంటూ బెదిరిస్తూ దేవేంద్ర ఆదివారం రాత్రి నర్సిరెడ్డి తో గొడవకు దిగాడని తెలిపారు. అడ్డు వచ్చిన నర్సిరెడ్డి భార్యను కూడా దుర్భాషలాడడని ఫిర్యాదు మేరకు దేవేంద్ర పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.