సొసైటీ ముసుగులో… శఠ గోపం
సొసైటీ ముసుగులో… శఠ గోపం
-: మేము చెప్పనదే వేదం.. అంతా మాఇష్టం
-: అగ్నిమాపక, ఇతర శాఖల అనుమతులకు తిలోడకాలు
కర్నూలు క్రైమ్, మార్చి 24, (కర్నూలు ప్రభ న్యూస్) :
సొసైటీ ముసుగులో…మేము చెప్పనదే వేదం.. అంతా మాఇష్టం..ఫిక్సడ్ రేట్స్ చెప్పిన ధరలకే కొనాలి.. అప్పటికప్పుడు అమ్మకాలు జరుపుకుని జేబులు నిపుకుంటూ చౌకబారు నాణ్యత బట్టలు వస్తువులు విక్రయిస్తూ శఠగోపం పెడుతున్నారు. పండగలు దగ్గరపడుతున్న సందర్భాలను ఆసరా చేసుకుని నగరంలో వినియోగదారులకు ధరల విషయంలో మన్నికల విషయంలో షాపులు ప్రదర్శన మరియు అమ్మకందారులు వినియోగదారులని నిలువునా ముంచేస్తున్నారు. చేనేత పేరుతో విక్రయాల్లో 70 శాతం రెడీమేడ్ కు చెందినవి, అందులోనూ నాసిరకం శ్రీ కళాజ్యోతి హ్యాండి క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ని అడ్డం పెట్టుకొని నిర్వాహకులు కర్నూలు నగరంలోని బి క్యాంప్ విజ్ఞాన మందిరంలో గురువారం వ్యాపారాలు ప్రారంభించారు. అందులో దాదాపుగా 25 దుకాణాలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాలకూ సంబంధించిన దుకాణ దారులు నిర్వహకుడికి నిర్ణయించిన రోజువారీ రెంట్ ఇవ్వవలసి ఉంటుంది. షాప్ ను బట్టి 1500 నుండి 2000 వరకు ఉండవచ్చ అంచనా. ఇదే అదనుగా వినియోగదారులకు ఇష్టారీతిన మాన్నికలేని నాసిరకం వస్తువులను ఫిక్సడ్ రేట్స్ కు అమ్ముతున్నారు పై పై హంగులకు ఆశపడి మధ్యతరగతి కుటుంబాలు వీరి మాయలో పడి మోసపోతున్నారు.ఇందులో బట్టలు దుకాణాలు తిను బండారాల దుకాణాలు హ్యాండిక్రాఫ్ట్స్ పిల్లలు వస్తువులు చీరలు వంటసమగ్రిలు తదితర వస్తు వుల ప్రదర్శన మరియు అమ్మకం అని వినియోగదారులకు శఠగోపం పెడుతున్నారు. అంతే కాకుండా ఇలాంటివి ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహించాలంటే కొన్ని ప్రభుత్వ శాఖల నుండి అనుమతులు తీసుకునేది ఉంటుంది. అగ్నిమాపక, మునిసిపాలిటీ, పోలీస్, కమార్టియల్ టాక్స్ ఆఫీస్ నుండి క్యాజువల్ ట్రేడర్స్ కింద తాత్కాలిక రిజిస్ట్రేషన్ను నందు చేపించుకోవాలి. అలాగే ప్రతి అమ్మకానికి సంబంధించిన టాక్స్ ను క్లోసింగ్ రోజున చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా యథేచ్ఛగా అమ్మకాలను చేపడుతున్నారు. ఇలాంటివి నమ్మి అమాయక ప్రజలు మోసపోతూనే ఉన్నారు ఇలాంటివాటిని సంబంధిత అధికారులు శాఖ పరపమైన చర్యలు తీసుకొని ప్రజలు మోసపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.