బాబును వదిలి అన్నను నమ్ముకో.. పవన్ కల్యాణ్‌కు కొడాలి నాని సూచన..
1 min read
భీమ్లా నాయక్ సినిమాపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై నాని ఘాటుగా స్పందించారు. నాగార్జున అయినా.. పవన్ కల్యాణ్ అయినా ప్రభుత్వం దృష్టిలో ఒకటేనని తెలిపారు. సీఎం జగన్ (YS Jagan) కు కుట్రలు, కుతంత్రాలు తెలియదని స్పష్టంచేశారు. భీమ్లా నాయక్ సినిమా (Bheemla Nayak Movie) కు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి షరతులు పెట్టలేదని గుర్తుచేశారు. టికెట్ల రేట్లపై కమిటీ సూచనలు చేసిందని.. కానీ పెంచే లోపు అవాంతరాలు వచ్చాయని నాని తెలిపారు. సీఎం జగన్ దగ్గర చిరంజీవి విన్నపంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నాని స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలు సరికాదంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన పవన్‌కు సూచించారు. సినిమాలను.. రాజకీయాలకు ముడిపెట్టొద్దని సూచించారు. టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని పేర్కొన్నారు. ఈ మేరకు కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడారు