చిన వెంకన్నకు ఓ భక్తుడు భారీ విరాళం..
1 min read
Dwaraka Tirumala: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లోని శేషాద్రి కొండపై కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri venkateswara Swami) భక్తులతో కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలను అందుకుంటున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం. స్వయంభువుగా వెలసిన వేంకటేశ్వర స్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. తాజాగా చిన్న వెంకన్న స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని చిన్నవెంకన్నస్వామికి ఓ భక్తుడు బంగారు ఊయలను కానుకగా ఇచ్చారు. కళ్లు మిరుమిట్లు తొలిపే దగదగలతో పసుపు వర్ణంలో ఆ బంగారు తూగుటుయ్యాల మెరిసిపోయింది. ఉయ్యాలపై బంగారు నెమళ్లతో చెక్కబడి అత్యంత రమణీయంగా కనువిందు చేసింది.