జర్నలిస్ట్ పై అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలి
1 min read
జర్నలిస్ట్ పై అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలి..
డిఎస్పీ మహేష్ కు వినతిపత్రం అందజేసిన ఎపిడబ్ల్యుజెఎఫ్ నాయకులు, ప్రజాశక్తి సిబ్బంది
కర్నూలు క్రైమ్, మార్చి 14, (కర్నూలు ప్రభ న్యూస్) :
ప్రజాశక్తి కర్నూలు స్టాఫ్ రిపోర్టర్ వినయ్ కుమార్ పై అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎపిడబ్ల్యూజెఎఫ్ ప్రతినిధి బృందం ప్రజాశక్తి సిబ్బంది డిస్పీ ని కోరారు. సోమవారం డిఎస్పీ కార్యాలయంకు వెళ్లిన ఎపిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.మద్దిలేటి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మౌలాలి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చిన్న రామాంజనేయులు, ప్రజాశక్తి ఎడిషన్ మేనేజర్ నరసింహ, ఎడిషన్ న్యూస్ ఇన్ ఛార్జీ చంద్రయ్య, స్టాఫ్ రిపోర్టర్ వినయ్ కుమార్, డివిజన్ ఇన్ ఛార్జీ ఎల్లాగౌడు, సంఘం నగర కార్యదర్శి నాగేంద్ర తదితర నాయకులతో కలసి డిస్పీ మహేష్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ఎస్టీబీసీ కాలేజి గ్రౌండ్ లో ఇటీవల నిర్వహించిన అఖండ సినిమా కృతజ్ఞత సభ కవరేజ్ కోసం వెళ్లిన ప్రజాశక్తి ప్రతినిధి ఎం.వినయ్ కుమార్, కర్నూలు డివిజన్ ఇన్ ఛార్జ్ ఎల్లాగౌడు లను ను తాలుకా పోలీసు స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ మాసుల్ దుర్బాషలాడారని తెలిపారు.తాను జర్నలిస్టు ను అని చెప్పినా సదరు కానిస్టేబుల్ వినకుండా అనుచితంగా ప్రవర్తించారన్నారు.జర్నలిస్టులు కనీస విధులను కానిస్టేబుల్ ఆటంకపరచడం దుర్మార్గమన్నారు.జర్నలిస్టులకు రక్షణ లేకుండాపోతోందన్నారు. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొంతమంది పోలీసు సిబ్బంది వ్యవహరిస్తున్నారని డిస్పీ దృష్టికి తెచ్చారు.జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని జర్నలిస్టుల హక్కులను గౌరవించేలా సిబ్బందికి సూచించాలని పేర్కొన్నారు.భవిష్యత్తులో ఇలాంటి సభలు జరిగినప్పుడు జర్నలిస్టులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాహుకులు సైతం అందుకు బాధ్యత వహించాలన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలను తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చంద్రమోహన్, చంద్రయ్య, పాణ్యం నియోజకవర్గం కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు విజయ్, మధు కల్లూరు మండల కార్యదర్శి పరమేష్, మండల ఉపాధ్యక్షులు నాగేంద్రుడు, మండల కోశాధికారి శ్రీను, నాయకులు శ్రీరాములు, మునిస్వామి, షబ్బీరు, బాలు, మధు, పక్కీరప్ప, తదితరులు పాల్గొన్నారు.
విచారించి చర్యలను తీసుకుంటాం
డీఎస్పీ కేవీ మహేష్ ప్రతిస్పందిస్తూ ప్రజాశక్తి ప్రతినిధి పై అనుచితంగా ప్రవర్తించినట్లు ఇదివరకే జర్నలిస్టులు తమ దృష్టికి తెచ్చారని దీనిపై సదరు కానిస్టేబుల్ కు ఛార్జిమెమో అందజేస్తామన్నారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తనకు ముందస్తు సమాచారం ఇస్తే జర్నలిస్టులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లను చేసేలా చర్యలను తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టుల హక్కులను గౌరవించేలా సిబ్బందికి సైతం తగు సూచనలు ఇస్తామని తెలిపారు.