హోళగుంద మండలంలో చలివేంద్రం ఏర్పాటు
1 min read
హోళగుంద మండలం లో చలివేంద్రం ఏర్పాటు
హోళగుంద, మార్చి14 (కర్నూలు ప్రభ న్యూస్) :
మండల పరిధిలోని బస్టాండ్ నందు దివంగత ఉపాధ్యాయుడు చిన్నహ్యట కురువ బీరప్ప జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ చిన్నహ్యటా గ్రామానికి చెందిన బీరప్ప వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన జ్ఞాపకార్థంగా, ఎండలు రోజురోజుకు పెరిగి పోతుండటంతో స్థానిక బస్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కుటుంబ సభ్యులు తమవంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శేషప్ప, ఎంపీపీ తనయుడు ఈసా,సిద్ధార్థు గౌడ,వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ షఫీ, సర్పంచ్ తనయుడు పంపాపతి, డి ఎస్ భాష, చిన్నహ్యట సర్పంచ్ హేషన్, మర్లమడికి సర్పంచ్ తనయుడు రమేష్, మాజీ సర్పంచ్ వెంకటేష్, హెచ్ఎం శేషాద్రి,చిన్నహ్యట బసవ, అంజిని,నగబిరప్ప,యల్లప్ప,ససప్లయర్ సిద్ధప్ప, గిడ్డయ్య, కనకశ్రీ యూత్ మిత్రులు యస్ కె గిరి,పెద్దహ్యట మల్లయ్య,మరిమల్ల, హోలాగుంద పంపాపతి, సిద్ధప్ప,విరుపాపురం నగరాజ్,రమేష్ ముద్దటమగి హనుమంతు, హోలాగుంద గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.