40 కొత్త పైపులైన్ కొళాయి కలెక్షన్
1 min read
40 కొత్త పైపులైన్ కొళాయి కలెక్షన్..
హోళగుంద, మార్చి 14, (కర్నూలు ప్రభ న్యూస్) :
మండలం పరిధిలోని పెద్దహ్యట గ్రామంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సహకారంతో మండల అధ్యక్షుడు ఈసా ఆధ్వర్యంలో పెద్దహేట గ్రామంలో దాదాపుగా ముప్పై ఏళ్ళ క్రితం నుండి ఎస్సీ కాలనీ వాసులకు నీరు అందే పరిస్థితి ఉండేది కాదు గ్రామ ప్రజలందరూ కలిసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సమస్యను వివరించగా సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయడమైనది. మండల అధ్యక్షులు ఈసా తక్షణమే స్పందించి పెద్దహ్యట హేట గ్రామంలో ఎంపిటిసి శివన్న ఆధ్వర్యంలో కొత్త పైపులైన వేసి దాదాపు 40 కొత్త కొళాయి కలెక్షన్ ఇవ్వడం జరిగింది. పెద్దహ్యాట ఎస్సీ కాలనీ ప్రజలు కొత్త కలెక్షన్ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈసా మరియు వైస్ ఎంపీపీలు కెంచప్ప, హనుమప్ప, ఈ ఓ పి ఆర్ డి చంద్రమౌళి గౌడ్, పంచాయతీ సెక్రెటరీ షఫీ,ఎంపిటిసి శివన్న , వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు మేలిగిరి, మల్లి, హనుమంత, పురుష గ్రామ ప్రజలు పాల్గొన్నారు.