ఆధార్ కార్డు లేని చిరంజీవి
1 min read
ఆధార్ కార్డు లేని చిరంజీవి
మద్దికేర, మార్చి 12, (కర్నూలు ప్రభ న్యూస్) :
మండల కేంద్రంలోని హరిజన వీధికి చెందిన శివ సుగుణమ్మ కుమారుడు పారా చిరంజీవికి ఆధార్ కార్డు ప్రారంభమైనప్పటి నుండి హైదరాబాద్ కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లి ఎన్విరోల్ చేసుకున్నప్పటికీ ఆధార్ కార్డు మంజూరు కావడం లేదు. ఆధార్ కార్డు లేకపోవడంతో మా అబ్బాయి చదువు మధ్యలోనే మధ్యంతరంగా ఆగిపోయింది. ఉన్న ఒక్క కొడుకును చదివించు కోవాలని ఆశ ఉన్నప్పటికీ పాఠశాలలో ఆధార్ కార్డు అడ్డగా మారింది అని వారు అన్నారు.