ఘనంగా వైసిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం
1 min read
ఘనంగా వైసిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం
మద్దికేర, మార్చి 12, (కర్నూలు ప్రభ న్యూస్) :
మద్దికెర మండల కేంద్రంలోని శనివారం నాడు 12 వ వైయస్సార్ సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలం లో ఉన్న వైసీపీ నాయకులు మొదటగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం గురించి పలువురు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ప్రతి కార్యకర్త కు న్యాయం చేయాలని ఏదైనా చెప్పమంటే చేసి చూపించే పార్టీ వైసీపీది అని అన్నారు.కార్యక్రమంలో ,జెడ్పీటీసీ సభ్యులు మురళీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, ఇరిగేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్ మాజి ఎంపిపి మల్లికార్జున యాదవ్,ఎంపీటీసీలు కాలువ రామకృష్ణ,,గద్దల అంజినేయులు,పంచాయితీ సలహాదారు బండారు ఆంజనేయులు వైస్ ఎంపీపీ కాకర్ల మహేష్ రెడ్డి, బీసీసెల్ కృష్ణయ్య కవి దాసు తదితరులు పాల్గొన్నారు