September 30, 2023

రాష్ట్ర అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యం

1 min read

సంక్షేమ పథకాలే జెండాగా…. రాష్ట్ర అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యం..

ఆలూరు నియోజకవర్గంలో  ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

హోళగుంద, మార్చి 12, (సీమ కిరణం న్యూస్) :


ఆలూరు నియోజకవర్గం పరిధిలో వై.యస్.ఆర్ సర్కిల్ నందు వై.యస్.ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూలమాలలు వేసి నివాళులు అర్పించిన.రాష్ట్ర మంత్రి గుమ్మనూరు బ్రదర్స్ పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి,గుమ్మనూరు శ్రీనివాసులు.ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు .పలువురు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులు,మండల కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు,ఆలూరు నియోజకవర్గం వై.యస్.ఆర్ సర్కిల్ నందు వై.యస్.ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి ,గుమ్మనూరు శ్రీనివాసులు  అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కటింగ్ చేసి పార్టీ నాయకులకు గుమ్మనూరు బ్రదర్స్ తినిపించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు బ్రదర్స్ మాట్లాడుతూ…ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలు,నాయకులకు, ప్రజాప్రతినిధులకు,ప్రతి ఒక్కరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టకలోనే పోరాటం ఉంది. మాజీ ముఖ్యమంత్రివర్యులు దివగంత మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకోసం అయన తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముందుకు అడుగులు వేస్తున్నారు.అని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజాదరణతో రాష్ట్రంలో అనూహ్య మెజారిటీతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నవరత్నాలతో నవశఖాన్ని తెచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి.అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ ఏరూరు శేఖర్,హాలహర్వి జడ్పీటీసీ లింగప్ప,ఆలూరు ఎంపీపీ బూర్ల సుభాషిణి,వైస్ ఎంపీపీ బోయ నాగమణి,చిప్పగిరి మండల కన్వీనర్ గుమ్మనూరు నారాయణ, ఆలూరు కన్వీనర్ వీరేశ్, హాలహర్వి కన్వీనర్ భీమప్ప,ఉప సర్పంచ్ రవి,మాజీ జడ్పీటీసీ రాంభీ నాయుడు,మాజీ కన్వీనర్ చిన్నవీరన్న,హనుమయ్య, గోవింద్,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!