September 27, 2023

రాజ్యాంగ విలువలు కాపాడాలి : కర్నూలు జిల్లా ఎస్పీ

1 min read

రాజ్యాంగ విలువలు కాపాడాలి..

రాష్ట్ర అభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వాములు కండి

ఎపిబిజెఏ డైరీ ఆవిష్కరణలో జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి

కర్నూలు క్రైమ్ , మార్చి 12, (కర్నూలు ప్రభ న్యూస్) :

రాష్ట్ర అభివృద్ధి లో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఇ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక డిపిఓ కార్యాలయంలోని తన చాంబర్లో బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఆబ్జ ) డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలను కాపాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కి జర్నలిస్టు సంఘాలు పనిచేయాలన్నారు. డైరీ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఎవరి  వృత్తి లో వారు పట్టుదలతో పని చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లో ఏ పి డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మద్దిలేటి, ఆంధ్ర ప్రదేశ్ దేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఆబ్జ ) రాష్ట్ర ఉపాధ్యక్షులు టి జి ప్రసాద్,  ఏపిడబ్ల్యూ జె ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోరంట్లప్ప ,రాష్ట్ర నాయకులు  మౌలాలి ఆర్గనైజింగ్ కార్యదర్శి బి చిన్న రామాంజనేయులు, జిల్లా నాయకులు చంద్రయ్య,నగర కార్యదర్శి నాగేంద్ర, నాయకులు  మధు, తరులు పాల్గొన్నారు. అనంతరం అడిషనల్ ఎస్పీ నాగ బాబు డైరీని ఆవిష్కరించారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!