విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేపట్టిన మాజీ మంత్రులు
1 min read
విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేపట్టిన మాజీ మంత్రులు
నంద్యాల , మార్చి 11, (సీమకిరణం న్యూస్) :
విశ్వనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యా హ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థత గురైన విషయాన్ని తెలుసు కున్న మాజీ మంత్రులు ఫరూక్, భూమా అఖిలప్రియ, మాజీ ఎ మ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి లు విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి ఆస్పత్రి అవరణలో ధర్నా చేపట్టారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ విద్యార్థుల తల్లిదండ్రు లతో కలిసి ధర్నా చేపట్టారు. కాంట్రాక్టర్ సురేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుం బాలకు వెంటనే న్యాయం చే యాలన్నారు. గుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకుఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తా రని సూటిగా ప్రశ్నించారు. జిల్లా విద్యాశాఖాధికారి రంగా రెడ్డి, తహసిల్దార్ రవికుమార్ లు వారిని సముదాయించి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు నమోదు చేయాలని, లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ ధర్నాలో అళ్ళగడ్డ టిడిపి నాయకులు భూమా జగత్ విఖ్యాత రెడ్డి, నాయకులు ఫిరోజ్, కౌన్సిలర్లు నాగార్జున, మాబువాలి, జైనాబి, శ్రీదేవి తదితర నాయకులు పాల్గొన్నారు