42 మంది విద్యార్థులకు అస్వస్థత
1 min read
42 మంది విద్యార్థులకు అస్వస్థత
– పిల్లలను ప్రభుత్వ ఆసు పత్రికి తరలింపు
స్థానిక విశ్వనగర్ కాలనిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజ నం వికటించి 42 మంది విద్యా ర్థులు అస్వస్థతకు గురయ్యా రు. వారిని వెంటనే చికిత్స ని మిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనతో ఉరు కులు, పరుగులతో ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారులకు ప్రమాదం ఏమి లేదని వైద్యులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వైద్యులు స్పందించి ఎవరికి ఏ ప్రాణ హాని జరగకుండా వైద్యసేవలు అంది స్తున్నారు. జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. విజయ్ కుమార్ పిల్లలను పర్యవేక్షించి వైద్యులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎంఇఓ బ్రహ్మం నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి పాఠశాలకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అసెంబ్లీ సమావే శాల్లో ఉన్న ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అక్కడి నుండే ఆస్పత్రి సూపరింటెడెంట్ డా.విజయ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి విద్యార్థులకు మెరు గైన వైద్యం అందించాలని సూచించారు.