రైతు సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
1 min read
రైతు సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ : మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి
ప్యాపిలి, మార్చి 11, (కర్నూలు ప్రభ న్యూస్ ) :
పట్టణంలోని వెలుగు కార్యాలయంలో మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి దిలీప్ చక్రవర్తి, ఉప సర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా కరెంట్ షాక్ తో మరణించిన గుడిపాడు మాజీ సర్పంచ్ పెద్ద పుల్లారెడ్డి కి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలపై ఆర్బికే సిబ్బంది గాని, సచివాలయ సిబ్బంది కానీ, నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారుల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు, గుడిపాడు ఘటనపై విద్యుత్ శాఖ ఏఈ వినయ్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు , భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైతులు సమస్యలతో వస్తే సచివాలయాల లో వారి పేర్లను, సమస్యను రిజిస్టర్ చేసుకొని 24 గంటల్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు, త్వరలోనే నాణ్యమైన శనగలను 5230 రూపాయల ప్రభుత్వ మద్దతుతో ధరతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి బొర్రా మళ్ళీ కార్జున రెడ్డి ప్యాపిలి మండల బోరెడ్డి రాము, ఎంపీడీవో ఫజల్ రెహమాన్, వ్యవసాయ అధికారి షెక్షావలి, ఏపీఓ వెంకటరమణ, మండల వ్యవసాయ సలహామండలి మెంబెర్స్, రైతులు, సంబంధిత అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.