ఉచిత చల్లనీ త్రాగు నీటి కేంద్రం ప్రారంభోత్సవం
డోన్ రోటరీ క్లబ్ మరియు పురపాలక సంఘం ఆద్వర్యంలో ఉచిత చల్లనీ త్రాగు నీటి కేంద్రం ప్రారంభోత్సవం
డోన్ టౌన్, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :
డోన్ పాత బస్టాండ్ గాంధీ సర్కిల్ నందు చల్లటి నీటి చలివేంద్రాన్ని జి. రాజయ్యగౌడ్ వారి ధర్మపత్ని జి. మద్దమ్మ గార్ల ఆర్థిక సహాయముతో ఏర్పాటు చేయడమైనది. పట్టణ ప్రజలకు వేసవి కాలంలో వివిధ ప్రాంతాల నుండి డోన్ పట్టణానికి వచ్చే ప్రజలకు దాహాన్ని తీర్చడం కొరకు ఈ చలివేంద్రాన్ని డోన్ పట్టణ మునిసిపల్ చైర్మాన్ సప్తసైల రాజేష్ గారు మరియు కె.ఎల్.ఎన్. రెడ్డి మునిసిపల్ కమీషనర్ గారు ప్రారంబించడమైనది. ఈ కార్యక్రమం రోటర్ క్లబ్ ప్రెసిడెంట్ జింకల క్రిష్ణ రోటరీ క్లబ్ సెక్రటరీ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ సబ్యులు రాజా విజయ కుమార్, జగన్ హన్, క్రిష్ణ కిషోర్, రామాంజనేయులు ఆచారి, సత్యసేనా రెడ్డి, ఎస్. నాగరాజు, లక్ష్మిరెడ్డి, శంకర్ గౌడ్, ఎసి. పుల్లారెడ్డి, నందుబలరామ్, రాజా రాజశేఖర్, బుగ్గారెడ్డి, వార్డు కౌన్సలర్ మల్లికార్జున రెడ్డి, ఇన్నర్బల్ సబ్యులు మద్బమ్మ, శైలజా, శారద దేవి గారు తదితరులు పాల్గోనడమైనది.