మంత్రి పెద్దిరెడ్డి కలిసిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
మంత్రిని కలిసిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
పత్తికొండ, ప్రతినిధి, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :
పత్తికొండ నియోజకవర్గం లో బొందిమడుగుల నుంచి పత్తికొండ వెళ్ళే ప్రధాన రహదారి మరియు కంబాలపాడు గ్రామం నుంచి కోయిలకొండ వెళ్లే రహదారిలో వర్షాలకు బ్రిడ్జిలు దెబ్బతినీ రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ విజయవాడలోని పంచాయతీ రాజ్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో వివరించడం జరిగింది. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయవలసిందిగా ఆదేశించారు