కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి రంగారెడ్డి పాఠశాల తనిఖీ
1 min read
కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి రంగారెడ్డి పాఠశాల తనిఖీ
డోన్ టౌన్, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :
కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి రంగారెడ్డి గారు డోన్ పట్టణం నందు గల పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని,వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకుని ప్రతిరోజూ వారికి కొన్ని ప్రశ్నలు ఇచ్చి జవాబులు నేర్పించాలని తెల్పారు. గతంలో 6 వ తరగతి విద్యార్థిని కొట్టారని విద్యార్థి సంఘం ఫిర్యాదు చేయడంతో ఆ ఉపాధ్యాయుడిని, ఆ విద్యార్థిని పిలిపించి ఎంక్వైరీ చేసారు. మళ్ళీ సమస్య రాకుండా జాగ్రత్తపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ, కర్నూలు ఉర్దూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆదాం భాష, సీనియర్ ఉపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి, శివ ప్రసాద్, వెంకటేశ్వర్ గౌడ్, వెంకట రమణ, లక్ష్మయ్య, లక్ష్మి కాంతరెడ్డి సుబ్బారాయుడు,భాను ప్రకాష్ రెడ్డి, శ్రీనివాసులు, మద్దిలేటి, దేవేంద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.అలాగే ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద కొచ్చెర్వు పాఠశాల ఉపాధ్యాయుని పై ఎంక్వైరీ నిర్వహించారు. ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ ను తనిఖీ చేశారు.వారి వెంట సి.సి.జయరాం నాయక్ తదితరులు ఉన్నారు.