హాకీ క్రీడాకారులకు టీ షర్టుల పంపిణీ
1 min read
హాకీ క్రీడాకారులకు టీ షర్టుల పంపిణీ
కర్నూలు స్పోర్ట్స్ , మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :
హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 15 వరకు విశాఖపట్నంలో లో జరిగే పన్నెండవ హాకీ ఆంధ్ర ప్రదేశ్ సీనియర్ మహిళల అంతర్ జిల్లల హాకీ ఛాంపియన్షిప్ లో పాల్గొనే కర్నూలు జిల్లా మహిళల జట్టు కు మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో జరిగిన టీ షర్ట్ పంపిణీ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్. స్టూడెంట్ జిల్లా అధ్యక్షులు రెడ్డి పోగు ప్రశాంత్ టీ షర్ట్ లను, క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ మాట్లాడుతూ క్రీడల ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు, వైద్య రంగంలో ప్రవేశించారు, అని మీరు కూడా క్రీడా కోటలో వెళ్లాలని ఆకాంక్షించారు, అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లే జిల్లా జట్టుకు ఆర్థిక సాయం అందజేస్తానని తెలిపారు, హాకీ కర్నూల్ కార్యదర్శి దాసరి సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో మన జిల్లాకు మంచి పథకాలతో, రావాలని కోరారు, ఈ కార్యక్రమంలో హాకీ కర్నూల్ ట్రెజరర్,ఎం వెంకటేశ్వర్లు క్రీడాకారులు శ్రీకాంత్ మొదలగు వారు పాల్గొన్నారు.