పుష్పలోని ఊ అంటావా, ఊహు అంటావా సాంగ్‌కు పేరడీ సాంగ్‌ను పాడిన వైసీపీ ఎమ్మెల్యే.. వైరల్
1 min read
అల్లు అర్జున్(Allu Arjun)హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలోని సాంగ్స్, హీరో మ్యానరిజం తెలుగు ప్రేక్షకులనే కాదు.. దేశ విదేశాలలోని అనేక మందిని ఆకర్షించాయి. సెలబ్రెటీలు, క్రికెటర్లతో పాటు సామాన్యులు కూడా పుష్ప సినిమాలోని సాంగ్స్ కు స్టెప్స్ వేస్తూ అలరిస్తున్నారు. అయితే తాజాగా పుష్ప సినిమా క్రేజ్ ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా తాకింది. అది ఆంధ్రప్రదేశ్ లోకి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పుష్ప సాంగ్ ను పాడి అలరించారు. ఊ అంటారా తల్లి ఉహూ అంటారా అంటూ పాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది