వైకాపా పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయ్ పూలే వర్ధంతి
1 min read
వైకాపా పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయ్ పూలే వర్ధంతి
ఆదోని ప్రతినిధి, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :
ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయ్ పూలే వర్ధంతి కార్యక్రమం జరిగినది. అనంతరం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి దేవా మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశ చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పేద మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించి పురుషులకు సమానంగా విద్యాబుద్ధులు నేర్పించి రాజకీయంగానూ ఉద్యోగ పరంగానూ అన్ని విధాలుగా మహిళలు చైతన్య పరుస్తూ ఈరోజు భారతదేశంలోనే సావిత్రిబాయి పూలే పేరును సువర్ణాక్షరాలతో లిఖించబడవ్యక్తిగా నిలిచింది సావిత్రిబాయి పూలే ఇటువంటి మహానుభావులు అడుగుజాడల్లో మనం కూడా నడవాలి వైయస్సార్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా మహిళలకు 51% శాతం రాజకీయ పదవులు ఉద్యోగ పరంగాను ఇచ్చే భారతదేశంలోనే మహనీయుడు గా నిలిచిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు అలాగే మన ఆదోని శాసనసభ్యులు వై సాయి ప్రసాద్రెడ్డి అత్యధిక సీట్లు 28 కౌన్సిలర్ సీట్లు ఇచ్చి వారిని గెలిపించి మున్సిపల్ చైర్మన్ పదవితో పాటు అలాగే ఎంపీటీసీ సీట్లు అలాగే ఎంపీపీ పదవి కూడా అలాగే స్టేట్ డైరెక్టర్లు మునిసిపల్ కోఆప్షన్ నెంబర్స్ మార్కెట్ యాడ్ కో ఆప్షన్నెంబర్స్ మహిళలకు ఇచ్చి వాళ్ల గౌరవించిన వ్యక్తి మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ని వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు బి దేవా అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత జిల్లా నాయకురాలు శ్రీలక్ష్మి కౌన్సిలర్లు ఉమామహేశ్వరి చిన్న సురేష్ వాషింగోవిందు బాబు వీరప్ప ఉస్మాన్. తదితరులు పాల్గొన్నారు.