డోన్ లో బిజెపి విజయోత్సవ ర్యాలీ
1 min read
డోన్ లో బిజెపి విజయోత్సవ ర్యాలీ
డోన్ టౌన్, మార్చి10, (కర్నూలు ప్రభ న్యూస్) :
బీజేపీ ప్రభుత్వలను ఆశీర్వదించిన నాలుగు రాష్ట్రా ల ప్రజలకు ధన్యవాదములు తెలుపుతూ డోన్ పట్టణం లో విజయోత్సవ ర్యాలీ ని ఘనంగా నిర్వహించిరు. ఈ సందర్బంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త కాపు హేమసుందర్ రెడ్డి మాటాడుతూ సబ్ కా సత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అను నినాదాలతో భారతీయ జనతా పార్టీ ప్రపంచం లోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందని గురువారం రోజు ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్ర లలోని ప్రజలు అత్యధిక మెజార్టీతో అశీర్వదించడం పై ఇక్కడ కుటుంబ పార్టీ లకు వెన్నులో వణుకు పుట్టిందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కమలం రెండు తెలుగు రాష్ట్ర లలో వికసించడం ఖాయమని వారు అన్నారు,. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వడ్డే మహారాజ్, డోన్ పట్టణ మరియు మండలఅధ్యక్షులు పోలా వెంకటేశ్వర్ల, శివశంకర్, నియోజకవర్గం ఇంచార్జ్ kc మద్దిలేటి, భరణి చంద్ర, ఔక్ వెంకటేశ్వర్లు, నాగార్జున, బొగ్గారపు శివ, పూజారి పనీ స్వామి, తిమ్మాపురం అంజి, చాంద్ బాషా, నాగరాజు, జీవన్,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.