నంద్యాల ఆర్డివో గా బాధ్యతలు స్వీకరణ
1 min read
ఆర్డివో గా బాధ్యతలు స్వీకరణ
నంద్యాల ప్రతినిధి, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :
నంద్యాల ఇంచార్జ్ ఆర్డివోగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీక రించారు. గురువారం ఆర్డీవో కార్యాలయ చాంబర్లో ఇంచార్జ్ ఆర్డివో శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కోనేరు రంగారావు కమిటీ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహించే వాడినని, కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల ఇన్చార్జ్ ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. ఇంతవరకు విధులు నిర్వహించిన సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ విధుల నుండి రిలీవ్ అయ్యారని, 20 21 జూన్ 29 నుండి నంద్యాల సబ్ కలెక్టర్ గా వీరు విధులు నిర్వహించారన్నారు.