జిల్లా ప్రభుత్వ కార్యాలయాల కొరకు భవనాలను పరిశీలించాం
1 min read
జిల్లా ప్రభుత్వ కార్యాలయాల కొరకు భవనాలను పరిశీలించాం.
ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే భవనాలను స్వాధీనం చేసుకుంటాం
నంద్యాల ఇంచార్జ్ ఆర్ డి ఓ .ఏ. శ్రీనివాసులు.
నంద్యాల ప్రతినిధి, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :
జిల్లా ప్రభుత్వ కార్యాలయాల కొరకు భవనాలను. నంద్యాల ఇంచార్జ్ ఆర్ డి ఓ .ఏ. శ్రీనివాసులు పరిశీలించారు. గురువారం నంద్యాల పట్టణంలో. జిల్లా ప్రభుత్వ కార్యాలయాల కొరకు అనువైన భవనాలను నంద్యాల ఇంచార్జ్ ఆర్ డి ఓ .ఏ. శ్రీనివాసులు నంద్యాల తహసిల్దార్ రవికుమార్. ఆర్డిఓ కార్యాలయం డిప్యూటీ ఎస్ ఓ .అల్లిపిర లతో కలిసి పరిశీలించారు. అనంతరం నంద్యాల. ఇంచార్జ్ ఆర్ డి ఓ .ఏ. శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నందున ఉన్నత అధికారుల ఆదేశానుసారం ఈరోజు నంద్యాల పట్టణంలోని. నూనెపల్లె సమీపంలోని ఆర్ ఏ ఆర్ ఎస్ ఆవరణంలోని భవనాలను . ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న విక్టోరియా రీడింగ్ రూము నుపరిశీలించడం జరిగింది అని అన్నారు గతంలో ఉన్న అధికారులు ప్రతిపాదనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని . ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లయితే భవనాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. వీరి వెంట ఆర్ ఏ ఆర్ ఎస్ . ఏ డి ఆర్ .NC వెంకటేశ్వర్లు. ఆర్ ఎ ఆర్ ఎస్.శాస్త్రవేత్తలు. తదితరులు ఉన్నారు.