September 27, 2023

హంసవాహనంపై విహరించిన జ్వాలా నరసింహుడు

1 min read

హంసవాహనంపై విహరించిన జ్వాలా నరసింహుడు

ఆళ్లగడ్డ, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో గురువారం హంసవాహనంపై జ్వాలా నరసింహస్వామి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి జ్వాల నరసింహ స్వామిని అర్చకులు లక్ష్మీనరసింహా చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. జ్వాలా నర సింహ స్వామిని హంస వాహనం పై ఆశీనులను చేసి ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవ
మూర్తులైన శ్రీ జ్వాలా నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మ వార్లకు అర్చకులు వేద మంత్రో చ్ఛారణల మధ్య
తిరుమంజనం నిర్వహించారు. వేద పండితులు గోష్టి నిర్వహించారు. రాత్రి జ్వాలా నరసింహస్వామి సూర్యప్రభ వాహనంపై కొలువు దీరి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.

దిగువ అహోబిలంలో :

దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ధ్వజా రోహణ కార్యక్రమం నిర్వహించారు. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప రంగనాథ యతీoద్ర మహా దేశికన్ ఆధ్వర్యంలో జిపిఎ సంపత్, ఈఓ బివి నర్సయ్య ల ఆధ్యర్యంలో ప్రధాన అర్చకులు కిడాంబి
వేణుగోపాలాచార్యులు, అర్చక బృందం వేదమంత్రో చ్ఛారణల మధ్య ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుడు కొలువు ధీరిన ధ్వజ పటాన్ని ఆవాహన చేసి ధ్వజస్తంభం పైకి ఎగుర వేసి ద్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మ వార్లను ప్రత్యేకంగా అలంక రించి కొలువు మండపంలో ఉంచి పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మ వార్లు ఎదుట అర్చకులు భేరీ తాటను వాయిస్తూ బ్రహ్మాది దేవతలకు ఆహ్వానం పలికారు. రాత్రి శ్రీ ప్రహ్లాద వరద స్వామి ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన
అనంతరం సింహవాహనంపై ఆశీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!