September 27, 2023

గంజహళ్లి బడేసాహెబ్ దర్గాను దర్శించుకున్న కోట్ల

1 min read

గంజహళ్లి బడేసాహెబ్ దర్గాను దర్శించుకున్న కోట్ల

రానున్నది చంద్రన్న రాజ్యం

కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి

గోనెగండ్ల, మార్చి 09, (కర్నూలు ప్రభ న్యూస్) :

గోనెగండ్ల మండలం, గంజహళ్లి గ్రామం లో గల శ్రీ శ్రీ శ్రీ సద్గురు గంజహళ్లి బడే సాబ్ దర్గాను ఉరుసు సందర్భంగా బుధవారం మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సందర్శించి దర్గాలో ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో,పాడి పంటలతో.. వర్ధిల్లాలని ప్రార్థించారు. గంజహళ్లి గ్రామం లో కోట్లకు టిడిపి కార్యకర్తలు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టి,ఘన స్వాగతం పలికారు. దర్గా నిర్వాహకులు, ధర్మ కర్తలు కోట్ల ను శాలువాతో ఘనంగా సన్మానించి దైవ ఆశీస్సులు అందజేశారు. అంతకంటే ముందు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి గోనెగండ్ల లో కాసేపు ఆగి కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ… రానున్నది చంద్రన్న రాజ్యమని, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని హైకోర్టు తీర్పు నివ్వడం హర్షణీయమన్నారు. జగన్ పాలన తీరు పట్ల న్యాయస్థానాలు పలుమార్లు తీర్పులతో ఆగ్రహాలు వ్యక్తం చేసినా సి.ఎం.జగన్ కు బుద్ధి రాకపోవడంతో వారికి న్యాయస్థానాల పట్ల ఏ పాటి గౌరవం ఉందో స్పష్టంగా అర్థమైంది అన్నారు. జగన్ యొక్క రాక్షస పాలన, రాచరిక పాలన పట్ల ప్రజలు ఉద్యోగులు విసుగు చెందారని, ప్రజల్లో జగన్ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గిపోయిందని, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం జరగాలంటే చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు. జగన్ కు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం కట్టబెట్టినందుకు ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు అయిన వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాలువ, ఎల్. ఎల్. సి.అండర్ గ్రౌండ్ పైపులైన్ నిర్మాణ పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే చేపడతామని రైతులకు భరోసా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలో మంజూరైన పక్కా గృహాలకు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో జగన్ సర్కార్ దోపిడీకి పాల్పడుతూ.. పేదల నుండి డబ్బులు వసూలు చేస్తూ జలగల్లా రక్తం పీ లుస్తున్నారని మండిపడ్డారు. జగన్ రాష్ట్రాన్ని పరిపాలించడం లో ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కోట్ల వెంట కృష్ణారెడ్డి, పరమేశ్వర రెడ్డి, ప్రభాకర్ నాయుడు, ఎమ్మిగనూరు టిడిపి నాయకులు కదిరి కోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్బోర్డు డైరెక్టర్ జి. అల్తాఫ్, గోనెగండ్ల మండలం నాయకులు గోనెగండ్ల సర్పంచ్ హైమావతి చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ రంగముని, అల్వాల సర్పంచ్ డాక్టర్ భాష, మాబువలి, యూనుస్, కౌలుట్లయ్య, అక్బర్ అలీ, మల్దకల్ స్వామి, కున్నూరు సిద్దన్న, హుసేని, గంజహళ్లి గ్రామం నేతలు రంగారెడ్డి, మాజీ సర్పంచ్ పెద్దయ్య, లక్ష్మన్న, మాదన్న, అశోక్ తదితరులు ఉన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!