September 28, 2023

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

1 min read

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

పరిపాలన అదికారి ఎస్. రామానుజమ్మ

మహిళా ఉద్యాగులతో కలసి కేక్ కట్ చేసిన కర్నూలు ఆర్డీఓ కార్యాలయం పరిపాలన అధికారి రామానుజమ్మ

కర్నూలు టౌన్, మార్చి 08, (సీమకిరణం న్యూస్) :

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కర్నూలు రెవెన్యూ కార్యాలయం పరిపాలన అధికారి ఎస్. రామానుజమ్మ పిలుపు నిచ్చారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు ఆర్డీవో కార్యాలయములో మహాల ఉద్యగులతో కలసి పరిపాలన అధికారి రామానుజమ్మ కేక్ కట్ చేసి అందరికీ అందజేసి ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందు ఉన్నారని ఆమె గుర్తు చేశారు. మహిళలు లేనిదే సమాజ లేదన్నారు. మహిళలు పోలీస్ శాఖతో పాటు విమానయానంలో పైలెట్ గా కూడా నిరూపించు కోవడమే హర్షణీయం అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహనరెడ్డి మహిళ అభివృద్ది కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అంతర్జాతయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించ డం పట్ల ఆమె హర్సం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డి టీ అరుణ, జూనియర్ అసిసటెంట్స్ ఎస్.సనాఆఫ్రిన్, కే. మంజుల, డి వై ఫ్ ఓ గంగన్న, సీనియర్ అసిస్టంట్ రాజేష్, సిబ్బంది అన్వర్, నూర్ తదితరులు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!