ఆదివాసి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తా
1 min read
ఆదివాసి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తా
ఎన్.టి.ఎఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ నాగేశ్వరరావు
నెల్లూరు /సంగం, మార్చి 07, (కర్నూలు ప్రభ న్యూస్) :
ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎన్.టి.ఎఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా నూతనంగా నూతనంగా ఎన్నుకోబడిన బి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన బుచ్చిరెడ్డిపాలెం లో మాట్లాడుతూ ఆదివాసి గిరిజన బిడ్డగా తాను ఆదివాసీల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని అన్నారు. తనను ఎన్.టి.ఎఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించిన రాష్ట్రఎస్టీ కమిషన్ కుంభ రవిబాబు కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పు శ్రీనివాసులు, ఉదయ్ కుమార్ ల సహకారం మరువలేనిదన్నారు. ఆదివాసీ గిరిజన కి రావాల్సిన రాయితీలు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఆదివాసీల పై అత్యాచారాలు దాడులు జరిగితే సహించేది లేదన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలో పాముల కులానికి చెందిన కొందరు ఆదివాసీ గిరిజనుల కులం సర్టిఫికెట్ పొంది ఉద్యోగాల సంపాదించారని అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.