అందరి కృషి అభినందనీయం : జిల్లా ఎస్పీ
1 min read
అందరి కృషి అభినందనీయం
కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
కర్నూలు క్రైమ్, మార్చి 02, (కర్నూలు ప్రభ న్యూస్) :
శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీసు యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో భక్తుల భద్రత, క్షేమమే లక్ష్యంగా బాగా పని చేసి శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ను విజయవంతంగా పూర్తి చేశారని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో శ్రీశైలంతో పాటు మహానంది, యాగంటి ఇతర ముఖ్యమైన శైవ క్షేత్రాలలో లక్షల మంది దర్శించుకున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగియడంలో కృషి చేసిన ఆయా దేవస్ధానాల సిబ్బంది , అన్ని శాఖల ఉద్యోగులు కలిసి కట్టుగా సమర్ధవంతంగా విధులు నిర్వహించడం లో అందరి కృషి ఉందన్నారు. మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాల బందోబస్తు విధుల్లో పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. శ్రీశైలం నుంచి కర్నూలు జిల్లాకు తిరుగు ప్రయాణమైన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, లోటుపాట్లు లేకుండా అందరూ బాగా పని చేశారని హోంగార్డు స్ధాయి నుండి అడిషనల్ ఎస్పీ స్ధాయి వరకు ప్రతి ఒక్కరూ నిర్విరామంగా కృషి చేశారన్నారు.