October 1, 2023

రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ నిధులు విడుదల చేసిన కేంద్రం

1 min read
రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ నిధులు విడుదల చేసిన కేంద్రం

రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ నిధులు విడుదల చేసిన కేంద్రం

దిల్లీ, మార్చి 02, (కర్నూలు ప్రభ న్యూస్) :

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పేరుతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రొవిజన్‌ పెట్టింది. అమరావతినే ఏపీ రాజధానిగా పేర్కొంటూ 2022-23 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది.విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ప్రొవిజన్‌ తీసుకొచ్చింది. సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు, ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ.1,126 కోట్లు అంచనా వ్యయంగా ప్రొవిజన్‌లో కేంద్రం పేర్కొంది. జీపీవోఏకి భూసేకరణ వ్యయం రూ.6.69 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. 2020-21, 2021-22 బడ్జెట్‌లలో మొత్తం రూ.4.48 కోట్లు ఖర్చే చేసినట్టు కేంద్రం తెలిపింది. 2021-22 బడ్జెట్‌లో ఉద్యోగుల నివాస గృహాల భూసేకరణ వ్యయం రూ.21 కోట్లుగా అంచనా వేసిన కేంద్రం.. రూ.18.30 కోట్లు ఖర్చు చేసింది. 300 ఏజీ స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణ వ్యయాన్ని రూ.200 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్‌లో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!