September 25, 2023

మహిళా చైతన్యానికి ప్రతీక సరోజినీ నాయుడు

1 min read
మహిళా చైతన్యానికి ప్రతీక సరోజినీ నాయుడు

మహిళా చైతన్యానికి ప్రతీక సరోజినీ నాయుడు

రాయలసీమ వీర మహిళ కమిటి సభ్యురాలు యస్.హసీనా బేగం

కర్నూలు టౌన్, మార్చి 02, (కర్నూలు ప్రభ న్యూస్) :

హిందూ ముస్లింలు ఐకమత్యంతో స్వాతంత్య్రం సమరంలో ముందుకెళ్లాలని ఉద్బోధించిన సరోజినీ నాయుడు ఉన్నది ఉన్నట్టుగా  చెప్పగలిగే ధీశాలి అని జనసేన పార్టీ రాయలసీమ వీర మహిళ కమిటి సభ్యురాలు యస్.హసీనా బేగం అన్నారు. సరోజినీ నాయుడు వర్ధంతి సందర్భంగా ఆమె జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ భారత కోకిలగా ప్రసిద్ధిగాంచిన సరోజినీ నాయుడు  మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచారు అని ఆమె పేర్కొన్నారు.  అంతేకాకుండా గొప్ప రచయిత్రిగా ఉపన్యాసరాలిగా  స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న నాటి గొప్ప దార్శనిక నేతలతో ఈమె ఒకరు అని తెలిపారు. 1879 ఫిబ్రవరి 13న సాంప్రదాయ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సరోజినీ నాయుడు తండ్రి డాక్టర్ అఘోరనాథ్‌ చటోపాధ్యాయ, తల్లి వరద సుందరి నిజాం కాలేజీ తొలి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసిన అఘోర్‌నాథ్ ఎనిమిది భాషలలో పండితుడు అని అన్నారు. సరోజినీ నాయుడు తల్లి వరద సుందరి కూడా రచయిత్రి అని ఈమె పలు కావ్యాలు కథలు రాశారు ఆమె పేర్కొన్నారు. కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే కావడంతో సరోజినీ నాయుడుకు కూడా 12 ఏళ్లకే మద్రాసు యూనివర్శిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేసి రికార్డు నెలకొల్పారు అని తెలిపారు. 13వ ఏటనే రచయితగా మారిన సరోజినీ రాసిన ‘లేడీ ఆఫ్‌ ది లేక్‌’ రచన చదివిన నిజాం నవాబు ఆమెను ప్రోత్సహించారు అని అన్నారు. అంతేకాకుండా ఆమెకు అప్పట్లోనే ఉపకార వేతనం ఇచ్చి వివిధ రంగాల్లో పరిశోధనలు చేయమని ఇంగ్లాండు పంపారు అని తెలిపారు. సరోజినీ నాయుడు గొప్ప మేధావి అని ఆమె అన్నారు. లండన్‌ కింగ్స్‌ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన సరోజినీ నాయుడు తన రచనలతో బ్రిటిష్ విమర్శకులను సైతం మెప్పించారు అని తెలిపారు. ఆమె రచించిన  ‘బర్డ్‌ ఆఫ్‌ ది టైం’, ‘ది గోల్డెన్‌ థ్రెషోల్డ్‌’, ‘ది బ్రోకెన్‌ వింగ్స్‌’, ‘ఫెదర్ ఆఫ్ డాన్’  రచనలలో ప్రసిద్ధమైనవి అని అంతేకాదు, ‘ఫీస్ట్‌ ఆఫ్‌ యూత్‌, ది మ్యాజిక్‌ ట్రీ, ది విజార్డ్‌ మాస్క్‌, ఎ ట్రెజరీ ఆఫ్‌ పొయెం’లు సరోజినీ నాయుడు ఆంగ్ల సాహిత్యానికి మచ్చుతునకలు అని అన్నారు. ఇంగ్లీషు పద్యాలలో భారతీయ ఆత్మ ప్రతిఫలిస్తుంది ఆయన తెలిపారు. అంతేకాకుండా  పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా వినసొంపుగా పండటంతో ఆమెను ‘భారత కోకిల’ అని పిలిచేవారు అని అన్నారు. గోపాల కృష్ణ గోఖలే సూచనలతో 1905లో కాంగ్రెస్‌ సభ్యురాలిగా చేరిన సరోజినీ నాయుడు  1915లో గాంధీజీని కలిసిన తర్వాత జాతీయోద్యమంలోకి ప్రవేశించారు అని అన్నారు. తన వాడియైన ప్రసంగాలు, ఉపన్యాసాలతో ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిలించారు మేధావి అని అన్నారు.ఐరిస్ వనిత అనిబిసెంట్‌ అధ్యక్షతన భారత మహిళా సమాఖ్య స్థాపన 1917లో ఏర్పాటుకు సహకరించి మహిళ ఓటు హక్కు కోసం సిఫారసు చేశారు అని ఆమె అన్నారు. 1919లో మాంటెంగ్ ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ‘ఖిలాపత్‌’ ఉద్యమం, రౌలత్‌ చట్టం, ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు అని పేర్కొన్నారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు అని అప్పుడే భారత హోం రూల్‌ ప్రతినిధిగా లండన్‌ వెళ్లారు. ఇంగ్లాండులో ఉన్నప్పటికీ భారతీయుల జీవితాలను ప్రతిబింబిస్తూ రచనలు చేశారు అని తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో ముత్యాల గోవిందరాజులునాయుడిని కులాంతర వివాహం చేసుకుని మానవ జీవితానికి కుల, మతాల కన్నా మానవత్వమే ముఖ్యమని విశ్వసించారు అని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సామాజిక సేవలో విశేష కృషి చేశారు అని తెలిపారు.  మహిళలకు విద్య అవసరాన్ని వివరించిన ఆమె వారిలో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు  అని ఆమె అన్నారు. స్వాతంత్య్రం లభించిన తర్వాత దేశంలో తొలి మహిళా గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నియమించబడి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు అని తెలిపారు. 1949 మార్చి 2న సరోజినినాయుడు తన 70వఏట ఈ లోకాన్ని విడిచివెళ్లారు అని ఆమె అన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!