ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి : సోమిశెట్టి వెంకటేశ్వర్లు
1 min read
సోషల్ మీడియా పరంగా ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు టౌన్, మార్చి 01, (కర్నూలు ప్రభ న్యూస్) :
తెదేపా అధికారిక సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ కర్నూలు నియోజకవర్గ ఐటీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ సభ్యులు జిల్లా పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఇందులో భాగంగా పార్టీ కొరకు సమర్థవంతంగా పనిచేసే 14 మందితో కూడిన అసెంబ్లీ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు, ప్రభుత్వ తప్పిదాలను , అవినీతిని ఎప్పటికపుడు డిజిటల్ ప్లాటుఫార్మ్స్ పరంగా ఎప్పటికపుడు సోషల్ మీడియా పరంగా ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి నిజానిజాలు తెలియ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు తిలక్ గట్టు , నియోజకవర్గ అధ్యక్షుడు నీకేశ్వరుడు , ఉపాధ్యక్షుడు అశోక్ , సిటీ ప్రెసిడెంట్ అఖిల్ మరియు ఐటీడీపీ కమిటి సభ్యులు పాల్గొన్నారు.